చంద్రబాబు రాజీనామా చేయమంటే చేస్తా: ఎంపీ కేసినేని నాని

TDP MP Kesineni Nani Press Meet
x

చంద్రబాబు రాజీనామా చేయమంటే చేస్తా: ఎంపీ కేసినేని నాని

Highlights

విజయవాడ టీడీపీలో విభేదాలపై ఎంపీ కేసినేని నాని స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్న నాని.. తాను పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నానన్నారు....

విజయవాడ టీడీపీలో విభేదాలపై ఎంపీ కేసినేని నాని స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్న నాని.. తాను పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నానన్నారు. పార్టీలోని విబేధాలపై అధినేత చంద్రబాబే మాట్లాడతారని క్లారిటీ ఇచ్చారు. తన వల్ల పార్టీకి నష్టం ఉందనిపిస్తే తనను సస్పెండ్ చేసుకోవచ్చు అన్న నాని.. చంద్రబాబు రాజీనామా చేయమంటే చేస్తానన్నారు. తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయబోనని తేల్చి చెప్పారు. విమర్శలను వారి విచక్షణకు వదిలేస్తున్నానన్నారు.

పార్టీ కోసమే తాను కష్టపడుతున్నానని ఆయన చెప్పారు. విజయవాడ కార్పొరేషన్‌పై తెలుగుదేశం జెండా ఎగరాలన్నదే తన ధ్యేయమన్నారు. పార్టీ ఏది చెప్తే అది చేయటానికి తాను సిద్ధమని, తన దారిలో తాను వెళ్తుంటే తనకు తెలియని బాధలు కొందరికి ఉన్నాయేమోనని, ఆ విషయం తనకు తెలియదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునే హక్కుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories