Kesineni Nani: వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా

* పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన టీడీపీ ఎంపీ * నాకు డబ్బు, పదవులపై ఆశలు లేవు

Sandeep Reddy
Updated on: 24 Sept 2021 9:01 PM IST
TDP MP Kesineni Nani Decided to not Contestant In Next Election
X

కేసినేని నాని (ఫోటో: ది హన్స్ ఇండియా)

Kesineni Nani: టీడీపీ ఎంపీ కేసినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పినట్లు నాని ప్రకటించారు. తనతో పాటు తన కుమార్తె కూడా వచ్చే ఎన్నికలకు దూరమవుతున్నట్లు కేసినేని ప్రకటించారు. తనకు డబ్బు, పదవులపై ఆశలేదన్న నాని పార్లమెంట్‌లో నిధులు సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నానన్నారు. వచ్చే ఎన్నికలకు తాను దూరమైనా పార్టీలోనే కొనసాగుతానని కేసినేని నాని స్పష్టం చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story