Kanakamedala: శ్రీలంక తరహా పరిణామాలు ఏపీలో తలెత్తే అవకాశం.. ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధంగా ఉండాలని..

Kanakamedala: పార్లమెంటు స‌మావేశాల నేప‌థ్యంలో అఖిల‌ప‌క్ష భేటీకి టీడీపీ పార్లమెంటరీ పక్షనేత కనక మేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు.

Arun Chilukuri
Updated on: 17 July 2022 8:24 PM IST
TDP MP Kanakamedala Ravindra Kumar In All Party Meeting
X

Kanakamedala: శ్రీలంక తరహా పరిణామాలు ఏపీలో తలెత్తే అవకాశం.. ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధంగా ఉండాలని..

Kanakamedala: పార్లమెంటు స‌మావేశాల నేప‌థ్యంలో అఖిల‌ప‌క్ష భేటీకి టీడీపీ పార్లమెంటరీ పక్షనేత కనక మేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. శ్రీలంక తరహా పరిణామాలు ఏపీలో కూడా తలెత్తే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధంగా ఉండాలని కేంద్రాన్ని కోరామన్నారు ఎంపీ కనక మేడల. వైసీపీ ప్రత్యేక హోదా, విభజన చట్టం గురించి మొక్కబడిగా అడుగుతున్నారు తప్ప కేంద్రాన్ని నిలదీయడం లేదని ఆయన విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణంపై శ్రద్ధ తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు కనకమేడల తెలిపారు. వరదలు, సహాయక చర్యలపై అఖిలపక్షంలో లేవనెత్తామన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story