టీడీపీలో వల్లభనేని వంశీ చిచ్చు.. అలిగిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

టీడీపీలో వల్లభనేని వంశీ చిచ్చు.. అలిగిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
x
Highlights

టీడీపీలో వల్లభనేని వంశీ రేపిన చిచ్చు మరింత పెద్దదవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై పంచ్‌లతో విరుచుకుపడ్డ తీరు సంచలనం రేపుతోంది....

టీడీపీలో వల్లభనేని వంశీ రేపిన చిచ్చు మరింత పెద్దదవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై పంచ్‌లతో విరుచుకుపడ్డ తీరు సంచలనం రేపుతోంది. అంతేకాకుండా ఓ ప్రైవేటు ఛానెల్‌లో జరిగిన డిస్కషన్‌లో భాగంగా వంశీ, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ మధ్య జరిగిన డైలాగ్‌ వార్‌పై కూడా సంచలనాలకు దారి తీస్తోంది. లైవ్‌ డిస్కషన్‌లోనే వంశీ తన నోటికి పనిచెప్పారు. రాజేంద్రప్రసాద్‌పై బూతులతో దాడి చేశారు.

అయితే ఈ విషయంలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ తీవ్ర మనస్థాపం చెందినట్లున్నారు. తనపై వంశీ మాటలతో దాడి చేసినా పార్టీ నుంచి ఎవరూ స్పందించకపోవడంపై అలకబూనినట్లు తెలుస్తోంది. పార్టీతో పాటు తనపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేసిన ఏ ఒక్కరూ స్పందించకపోవడంపై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. కనీసం తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని రాజేంద్రప్రసాద్‌ చిన్నబుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

అయితే అంతలోనే పార్టీ నాయకులు ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టి వల్లభనేని వంశీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు..? అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్నదాన్ని వివరిస్తూ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అప్పటి వీడియోలను మీడియాకు విడుదల చేశారు. ఆనాడు చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి సమాధానం చెబుతారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Keywords: tdp, mlc rajendra prasad, vallabhaneni vamsi

Show Full Article
Print Article
More On
Next Story
More Stories