MLC Buddha Venkanna Tests Positive: ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్‌

MLC Buddha Venkanna Tests Positive: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 28 Aug 2020 12:05 PM IST
MLC Buddha Venkanna Tests Positive: ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్‌
X

బుద్ధా వెంకన్న   

TDP MLC Buddha Venkanna Tests Positive: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్ తేలింది. తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, 14 రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని బుద్దా వెంకన్న ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

'నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారు. ఈ 14 రోజులు రాజకీయలకు దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, అభిమానుల ఆశీస్సులతో కోవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను'అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,93,195 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,633. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,92,353కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 94,209 మంది చికిత్స పొందుతున్నారు.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story