Home > ఆంధ్రప్రదేశ్ > విజయసాయిరెడ్డికి ఇచ్చే గౌరవం.. ప్రతిపక్ష నాయుడైన చంద్రబాబుకి లేదా: అశోక్ బాబు
విజయసాయిరెడ్డికి ఇచ్చే గౌరవం.. ప్రతిపక్ష నాయుడైన చంద్రబాబుకి లేదా: అశోక్ బాబు

X
Highlights
రామతీర్ధంలో జరిగిన విగ్రహ ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ధ్వంసమైన...
Arun Chilukuri2 Jan 2021 11:07 AM GMT
రామతీర్ధంలో జరిగిన విగ్రహ ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ధ్వంసమైన విగ్రహాన్నిపరిశీలించడానికి ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు వెలితే పోలీసులు అనేక ఆటంకాలు సృష్టించారని అశోక్‌బాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ని ఏ చట్టప్రకారం పోలీసులు అడ్డుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. విజయసాయిరెడ్డికి ఇచ్చే గౌరవం ప్రతిపక్ష నాయుడైన చంద్రబాబుకి లేదా అని ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయకుండా వైసీపీ నేతల మోచేతి నీళ్లు తాగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రోడ్డుపై ధర్నా చేస్తేగానీ డీజీపీకి బుద్ధి రాలేదా అని నిలదీశారు.
Web TitleTDP MLC Ashok Babu Fires on fires on ap police
Next Story