సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు

సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు
x
Highlights

సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేశారు. అసెంబ్లీలో సీఎం జగన్ ఎమ్మెల్యేలను బఫూన్లు...

సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేశారు. అసెంబ్లీలో సీఎం జగన్ ఎమ్మెల్యేలను బఫూన్లు అంటూ అసభ్యకర పదజాలం వాడారని ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితే సీఎం సహానం కోల్పోతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.

రోజుకో అంశంపై అసెంబ్లీ వద్ద టీడీపీ ధర్నా నిర్వహిస్తోంది. ఇవాళ టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆందోళన చేపట్టింది. చంద్రబాబు రాజధాని పర్యటనలో దాడిని, చింతమనేని, కోడెల వంటి నాయకులపై జరిగిన దాడులు దారుణమని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories