AP Assembly: అసెంబ్లీ హాల్‌లో ఇంట్రెస్టింగ్ సీన్.. జగన్‌ను పలకరించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు

AP Assembly: ఏపీ అసెంబ్లీ హాల్‌లో ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. మాజీ సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లి పలకరించారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 July 2024 1:08 PM IST
AP Assembly: అసెంబ్లీ హాల్‌లో ఇంట్రెస్టింగ్ సీన్.. జగన్‌ను పలకరించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు
X

(File Photo)

AP Assembly:ఏపీ అసెంబ్లీ హాల్‌లో ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. మాజీ సీఎం జగన్‌కు దగ్గరకు వెళ్లి పలకరించారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. తనను హత్య చేయించేందుకు జగన్ ప్రయత్నించారంటూ ఇటీవలే జగన్‌పై ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణంరాజు. జగన్‌తో రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యేలందరూ ఆసక్తి చూశారు.

జగన్‌తో భేటీ తర్వాత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని జగన్‌ను కోరినట్లు తెలిపారు. ప్రతి రోజు శాసనసభ సమావేశాలకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. జగన్‌ అసెంబ్లీ సమావేశాలకు రావాలనే కోరుకుంటున్నానన్నారు రఘురామ. అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story