Payyavula Keshav: ఆ కేసు భయంతోనే హడావుడిగా సీఎం జగన్‌ విశాఖ రాజధాని ప్రకటన

TDP MLA Payyavula Keshav About Cm Ys Jagan Comments On Vizag Ap Capital
x

Payyavula Keshav: విశాఖ రాజధాని.. సీఎం ప్రకటన వెనుక అనేక కారణాలు..

Highlights

Payyavula Keshav: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నపళంగా సీఎం జగన్‌.. విశాఖ రాజధాని ప్రకటన చేశారని అన్నారు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.

Payyavula Keshav: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నపళంగా సీఎం జగన్‌.. విశాఖ రాజధాని ప్రకటన చేశారని అన్నారు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. హత్య జరిగిన రోజు అవినాష్‌ రెడ్డి.. ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారన్న అంశం ఇప్పుడు కీలకంగా మారిందని, ఆ కాల్‌ డేటా వివరాలు బయటకు రాకుండా.. ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం జగన్‌.. విశాఖ రాజధాని అంటూ ప్రకటన చేశారని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేసిందన్న విషయాన్ని పయ్యావుల గుర్తుచేశారు. హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్‌.. ఇంకా పెండింగ్‌లోనే ఉందని, ఇలాంటి సమయంలో సీఎం ప్రకటన కోర్టు ధిక్కరణే అవుతుందని చెప్పారు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.

Show Full Article
Print Article
Next Story
More Stories