రైతు దగాగ మారిన రైతు భరోసా : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

X
Highlights
రైతు భరోసా రైతు దగాగ మారిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. బీఏసీలో పంట నష్టంపై...
Arun Chilukuri30 Nov 2020 11:14 AM GMT
రైతు భరోసా రైతు దగాగ మారిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. బీఏసీలో పంట నష్టంపై ప్రస్థావిస్తే.. ప్రభుత్వం ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. సీఎం జగన్ విధానాల వల్ల రాష్ట్రంలో రైతులు భరోసా లేని వ్యవసాయం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలపై సభలో నిలదీస్తామనే భయంతోనే తమకు సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ సభ్యులను స్పీకర్ అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. చంద్రబాబు సహా 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, బాల వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, అచ్చెన్నాయుడు, బీ అశోక్, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణ బాబు, బుచ‍్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, సత్యప్రసాద్ సస్పెండ్ అయ్యారు.
Web TitleTDP MLA Nimmala Rama Naidu fires on AP Govt
Next Story