Atchannaidu tests positive for coronavirus : అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్‌

Arun Chilukuri
Updated on: 13 Aug 2020 5:45 PM IST
Atchannaidu tests positive for coronavirus : అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్‌
X

tdp mla atchannaidu tests positive for coronavirus: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈఎస్‌ఐ కుంభకోణం ఆరోపణలతో పోలీసులు ఇటీవల అచ్చెన్నాయుడిని అరెస్టు చేయగా.. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు.

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,996 కరోనా కేసులు వచ్చాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,64,142 కి చేరుకుంది. ఇందులో మొత్తం 90,840 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకూ 1,70,924 మంది కరోనా నుంచి కోలుకున్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story