logo
ఆంధ్రప్రదేశ్

AP 10th Exam Paper Leake: లీకు వీరులు వారే...

TDP Men Behind Exam Paper Leaks Says Jagan
X

AP 10th Exam Paper Leake: లీకు వీరులు వారే...  

Highlights

Jagananna Vidya Deevena: తిరుపతిలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jagananna Vidya Deevena: తిరుపతిలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణ, చైతన్య స్కూళ్ల నుంచే పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయన్నారు ఏపీ సీఎం జగన్. పేపర్‌ లీకులు సృష్టించి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాదీవెన పథకానికి మంచి పేరు వస్తుందనే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని విమర్శించారు సీఎం జగన్.

పేపర్‌ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇందులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలల వసతుల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు జగన్. ఇంగ్లీష్ మీడియం చదువులు బాబు హయాంలో ఉన్నాయా..? పేదల పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తే ఎందుకంటూ ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు సీఎం జగన్.

Web TitleTDP Men Behind Exam Paper Leaks Says, Jagan
Next Story