పసుపు వర్ణ శోభితం.. నేటి నుంచి తెలుగుదేశం మహానాడు...

పసుపు వర్ణ శోభితం.. నేటి నుంచి తెలుగుదేశం మహానాడు...
TDP - Mahanadu: 28న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ప్రారంభం...
TDP - Mahanadu: తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగకు రెడీ అయింది. నేటి నుంచి రెండురోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి ఒంగోలు వేదికగా మారింది. మహానాడు కోసం ఒంగోలు సమీపంలోని మండవారిపాలెం వద్ద సభా వేదికను ముస్తాబు చేశారు. 2018 తర్వాత నిర్వహిస్తున్న మహానాడు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇనుమడించిన ఉత్సాహంతో ఉన్నారు. మొత్తం 83 ఎకరాల్లో సభావేదిక, ప్రాంగణం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 20 వరకు భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు.
సభా ప్రాంగణానికి కుడివైపున ఫొటో గ్యాలరీ, రక్తదాన శిబిరం, మీడియా పాయింట్, వీఐపీల భోజనాలకు ఏర్పాటు చేశారు. వెనుకవైపు దాదాపు 500కు పైగా వీఐపీల వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యేవారి భోజనాల కోసం ప్రత్యేకంగా మరో ప్రాంగణం రూపుదిద్దుకుంది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి వాహనాలకు 53 ఎకరాల్లో ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 సభ్యత్వ నమోదు కౌంటర్లు ఆకర్షణీయంగా రూపొందించారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని కూలర్లు.. ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేర్వేరుగా గ్యాలరీలు, కుర్చీలు ఏర్పాటుచేశారు. నలభయ్యేళ్ల తెలుగుదేశం చరిత్ర.. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులకు సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కరికీ కనిపించేలా గ్యాలరీ ఏర్పాటు చేశారు.
మహానాడు తీర్మానాలకు టీడీపీ పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ప్రజా ప్రతినిధుల సభలో 17 తీర్మానాలు చేశారు. వీటిలో ఏపీకి 12, తెలంగాణకు 3 , అండమాన్‌కు ఒక తీర్మానం ఉంది. రాజకీయ తీర్మానంపై పొలిట్ బ్యూరోలో కీలకంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల మేరకు తీర్మానం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు.
ఇవాళ ఉదయం 9.30 గంటలకు మండువవారిపాలెంలోని మహానాడు ప్రాంగణానికి చంద్రబాబు చేరుకుంటారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ప్రతినిధుల సభ ఉంటుంది. 28న ఉదయం 9.30 గంటలకు అద్దంకి బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి శతజయంతి వేడుకలను చంద్రబాబు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మహానాడు ప్రాంగణానికి చేరుకుని సభ అనంతరం రాత్రి విజయవాడ బయలుదేరి వెళతారు.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
నిధుల సేకరణ కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. రాజధాని భూముల అమ్మకానికి...
25 Jun 2022 4:15 PM GMTటీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్
25 Jun 2022 4:00 PM GMTHealth Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్లో ఈ మార్పులు...
25 Jun 2022 3:30 PM GMTతెలంగాణ ఎంసెట్ హాల్టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..
25 Jun 2022 3:15 PM GMTVikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
25 Jun 2022 2:54 PM GMT