East Godavari: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో టీడీపీ శ్రేణుల ధర్నా

*టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెన్షన్ల నిలుపుదలపై ఆందోళన *మిగులు పద్ధతి అనుసరించడం సిగ్గు చేటు- ఎమ్మెల్యే చినరాజప్ప

Arun Chilukuri
Published on: 3 Sept 2021 2:32 PM IST
TDP Leaders Strike At East Godavari District Peddapuram
X

 ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప(ఫోటో: ది హన్స్ ఇండియా )

Andra Pradesh: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెన్షన్ల నిలుపుదలపై ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఒక్క నెల పెన్షన్ అందకపోయినా ఇకపై పెన్షన్ తీసుకోలేరు అనేలా ప్రభుత్వం నిర్ణయించడం సరికాదన్నారు. వృద్దుల్ని దగా చేయడమేనన్నారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌లోనూ మిగులు పద్ధతి అనుసరించడం, మిగుల్చుకోవడం అనే ధోరణి సిగ్గుచేటని మండిపడ్డారు. నియోజకవర్గంలోని మండల ప్రజాపరిషత్ అధికారులకు, కమిషనర్‌కు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వినతిపత్రం అందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story