Narsipatnam: విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత

Narsipatnam: విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 24 Nov 2021 4:26 PM IST
TDP Leaders Protest in Narsipatnam
X

Narsipatnam: విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత

Narsipatnam: విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ర్యాలీకి అనుమతి లేదంటూ అయ్యన్నపాత్రుడును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో అయ్యన్నపాత్రుడు వాగ్వివాదానికి దిగాడు. పోలీసు వలయాన్ని దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు భారీగా మోహరించారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేపట్టారు. అయ్యన్నపాత్రుడుకు మద్దతుగా టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story