Guntur: అంబటి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేతల ఆందోళన

Guntur: మంగళగిరిలో ఎమ్మెల్యే కిలారి రోశయ్యను అడ్డుకున్న టీడీపీ నేతలు

Sandeep Eggoju
Published on: 19 Nov 2021 6:36 PM IST
TDP Leaders Protest Against Ambati Rambabu Comments
X

అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకథల ఆందోళన (ఫైల్ ఇమేజ్)

Guntur: అంబటి వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తాలుకా సెంటర్‌లో మన్నెం శివనాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసిన రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాన్ని ముగించుకొని తిరిగి వెళ్తున్న ఎమ్మెల్యేను టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల సాయంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి గుంటూరుకు వెళ్లిపోయారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story