Top
logo

TDP: గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు

TDP Leaders Meet the Governor Biswabhusan in Raj Bhavan
X

గవర్నర్ ను కలసిన టీడీపీ లీడర్స్ (ఫైల్ ఇమేజ్)

Highlights

TDP: బ్లాంక్, రహస్య జీవోల వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు * ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు పలుమార్లు ఫిర్యాదు

TDP: టీడీపీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిశారు. బ్లాంక్, రహస్య జీవోల వ్యవహారంపై టీడీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశామని ఆయనకు ఫిర్యాదు చేస్తే మాకేంటన్న రీతిలో వైసీపీ ఉందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో అర్ధరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేస్తున్నారన్నారు. అన్ని జీవోల్లో తేదీ, జీవో నంబర్ మాత్రమే ఇస్తున్నారన్నారు. 12 రోజుల్లో 50 బ్లాంక్ జీవోలు ఇచ్చారన్నారు. పారదర్శకంగా పరిపాలన ఎందుకు చేకలేకపోతున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు.


Web TitleTDP Leaders Meet the Governor Biswabhusan in Raj Bhavan
Next Story