బుచ్చయ్య చౌదరిని బుజ్జగిస్తున్న చంద్రబాబు.. గోరంట్ల నివాసానికి భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు

Gorantla Butchaiah Chowdary: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.

Arun Chilukuri
Published on: 19 Aug 2021 3:14 PM IST
TDP Leaders Meet Gorantla Butchaiah Chowdary
X

బుచ్చయ్య చౌదరిని బుజ్జగిస్తున్న చంద్రబాబు.. గోరంట్ల నివాసానికి భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు

Gorantla Butchaiah Chowdary: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే పార్టీకి రాజీనామా వ్యవహారంపై స్పందించని గోరంట్ల ఇప్పుడేమీ మాట్లాడను తర్వాత స్పందిస్తానంటూ వెళ్లిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొదటి నుంచి అధిష్టానానికి విధేయుడిగా ఉన్నారు. కొన్ని రోజులుగా అధిష్టానం వైఖరి పట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన వర్గీయులు అనుకుంటున్నారట.

మరోవైపు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు చంద్రబాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఆయనకు బాబు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా సమస్య ఉంటే తనతో చెప్పాలని కోరారు. కానీ, పార్టీని విడొద్దని సూచించనట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story