వైసీపీలోకి మొదలైన వలసల పర్వం

వైసీపీలోకి మొదలైన వలసల పర్వం
x
Highlights

ఏపీలో చలికాలంలోనే రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. వైసీపీ వైపు టీడీపీ నేతలు క్యూకడుతున్నారు. టీడీపీని వీడి అధికారపక్షం వైపు చూస్తున్నారు కొందరు నేతలు.

ఏపీలో చలికాలంలోనే రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. వైసీపీ వైపు టీడీపీ నేతలు క్యూకడుతున్నారు. టీడీపీని వీడి అధికారపక్షం వైపు చూస్తున్నారు కొందరు నేతలు. అయితే వైసీపీలో చేరడానికి ముందు వరుసలో ఉన్న వల్లభనేని వంశీ పార్టీలో చేరక ముందే టీడీపీకి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. నిన్న దేవినేని అవినాష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన దేవినేని అవినాష్ తెలుగు యువత అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. సీఎం జగన్ నివాసానికి కడియాల బుచ్చిబాబుతో కలిసి వెళ్లి వైసీపీలో చేరారు.

మరో పక్క గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ పై పంచుల వర్షం కురిపించారు. ప్రభుత్వానికి కనీసం 6 నెలల సమయం కూడా ఇవ్వకుండా ఎందుకీ దీక్షలు చేస్తున్నారని చంద్రబాబును టార్గెట్‌ను చేస్తూ విమర్శించారు. వర్ధంతి- జయంతికి తేడా తెలియని వారు కూడా పార్టీని లీడ్ చేస్తున్నారని అలాంటి వాళ్లు నన్ను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు వల్లభనేని వంశీ.

ఇదిలా ఉండగా పార్టీ నుండి ఎవరూ చేజారిపోకుండా చంద్రబాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories