TDP: టీడీపీలో మొదలైన రాజ్యసభ రేసు.. రేసులో ముగ్గురు కీలక నేతలు..

రేసులో కనకమేడల,కంభంపాటి,గల్లా జయదేవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గత ఏప్రిల్‌‌లో కనకమేడల పదవి కాలం ముగియడంతో రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేకుండా పోయారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Aug 2024 11:24 AM IST
TDP Leaders in Race for Rajya Sabha
X

TDP: టీడీపీలో మొదలైన రాజ్యసభ రేసు.. రేసులో ముగ్గురు కీలక నేతలు..

TDP: టీడీపీలో రాజ్యసభ రేసు మొదలైందా? రాజ్యసభకు కీలక నేతలు పోటీ పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలు ఇప్పుడు టీడీపీలో చేరునున్నాయి. వైసీపీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న... మోపిదేవి, బీద మస్తాన్ రావులు రాజీమానా చేయడంతో ఇప్పుడు ఈ రెండు స్థానాలు టీడీపీ ఖాతాలో చేరనున్నాయి. దీంతో ఈ రెండు స్థానాలకు పలువురు టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి రాజీమానా చేసిన బీద మస్తాన్‌కు చంద్రబాబు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

రేసులో కనకమేడల,కంభంపాటి,గల్లా జయదేవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గత ఏప్రిల్‌‌లో కనకమేడల పదవి కాలం ముగియడంతో రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేకుండా పోయారు. అయితే 5 నెలల్లోనే సీన్ రివర్స్‌ అయింది. అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే రాజ్యసభలో ఖాతా తెరిచేందుకు టీడీపీ సిద్ధమైంది. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో ఖాళీ అయిన స్థానాలను వైసీపీ నుంచి పోటీ లేకుండా పోయింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story