Kodavalur: గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన టిడిపి నాయకులు

S. Srikanth
Updated on: 23 April 2020 4:00 PM IST
Kodavalur: గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన టిడిపి నాయకులు
X

కొడవలూరు: మండలం కొడవలూరు గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీలో, 100 గిరిజన కుటుంబాలకు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పిలుపు మేరకు, ఈరోజు ఉదయం పొలం రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో, అటు కేంద్ర ప్రభుత్వం... రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సందర్భంగా, పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తువ్వర ప్రవీణ్ కుమార్, కొప్పోలు నాగేశ్వరరావు, కొడవలూరు మండలం తెలుగు విద్యార్థి విభాగం అధ్యక్షులు తాత జగదీష్ గౌడ్, మండల ఎస్సీ నాయకులు నక్క రమణ పాల్గొన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story