ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై టీడీపీ శ్రేణుల దాడి

ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై టీడీపీ శ్రేణుల దాడి
x
Highlights

రామతీర్థంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో విజయసాయిరెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి....

రామతీర్థంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో విజయసాయిరెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో కారు దిగి నడుచుకుంటూ కిందకు వెళ్లారు విజయసాయిరెడ్డి. టీడీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా జిల్లాలోని రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 28 అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించి కొలనులో పడేసిన విషయం విదితమే.

Show Full Article
Print Article
Next Story
More Stories