ఆ నలుగురిపై చర్యలు తీసుకోండి.. తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్‌‌కు వర్ల రామయ్య ఫిర్యాదు

Varla Ramaiah: హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసుల వికృత చేష్టలపై తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ కు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

Arun Chilukuri
Updated on: 4 Oct 2022 8:46 PM IST
Tdp Leader Varla Ramaiah Writes Letter To Telangana Child Rights Commission On Ap Cid Officials
X

ఆ నలుగురిపై చర్యలు తీసుకోండి.. తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్‌‌కు వర్ల రామయ్య ఫిర్యాదు

Varla Ramaiah: హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసుల వికృత చేష్టలపై తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ కు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన లేఖను రామయ్య విడుదల చేశారు. సివిల్ దుస్తుల్లో ఉన్న నలుగురు వ్యక్తులు ఈనెల 1న చింతకాయల విజయ్ ఇంట్లోకి చొరబడ్డారని, విజయ్ పై దాడి చేశారని, వస్తువులను చెల్లాచెదురు చేశారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్ ను భయభ్రాంతులకు గురిచేసి చిన్నారుల ఫొటోలను తీసుకెళ్లారని, చిన్నారులతో సీఐడీ పోలీసులుగా భావిస్తున్న నలుగురు అనుచితంగా ప్రవర్తించారని రామయ్య ఆరోపించారు. వారిపై చర్య తీసుకోవాలని ఆ‍యన తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story