Prathipati Pulla Rao: ఏపీలో అరాచక పాలన నడుస్తోంది..

Prathipati Pulla Rao: ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోందన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

Arun Chilukuri
Updated on: 5 Nov 2022 8:01 PM IST
TDP Leader Prathipati Pulla Rao Slams Jagan
X

Prathipati Pulla Rao: ఏపీలో అరాచక పాలన నడుస్తోంది..

Prathipati Pulla Rao: ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోందన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. చంద్రబాబు పర్యటనలో కరెంట్ కట్ చేసి రాళ్లదాడి చేసిన ఘటనపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్దంగా ర్యాలీలు, సభలు, పరామర్శలకు వెళితే దాడులు చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. మొన్న అయ్యన్నను అక్రమంగా అరెస్ట్, నిన్న చంద్రబాబు‎పై దాడి, నేడు పవన్ కల్యాణ్ ను పర్యటనను అడ్డుకోవడం జగన్ అరాచక పాలనకు నిదర్శనం అన్నారు. ఇక చంద్రబాబును విమర్శించేస్థాయి మంత్రి విడుదల రజనికి లేదని చురకలంటించారు ప్రత్తిపాటి. మోటర్లకి మీటర్లు బిగించే విషయంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆయన అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ తెలుసుకుంటే మంచిదన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story