ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా
x
Highlights

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్‌కు రాజీనామా లేఖను పంపారు. వైసీపీకి మద్దతు పలికిన...

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్‌కు రాజీనామా లేఖను పంపారు. వైసీపీకి మద్దతు పలికిన నేపథ్యంలో సునీతపై చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. అయితే, విచారణకు ముందే ఎమ్మెల్సీ పదవికి సునీత రాజీనామా చేశారు. ఈ ఏడాది జనవరి 22 వ తేదీన పోతుల సునీత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై జరిగిన ఓటింగ్ విషయంలో టీడీపీకి ఆమె షాకిచ్చింది. టీడీపీ విప్ కు వ్యతిరేకంగా పోతుల సునీతతో శివనాథ్ రెడ్డిలు ఓటు వేశారు. వీరిద్దరూ ఆ తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈ ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ మండలి ఛైర్మెన్ షరీఫ్ కు ఫిర్యాదు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories