గోరంట్ల వీడియో నిజమైనదే.. అమెరికన్ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిందన్న టీడీపీ..

TDP Leader Pattabhi Ram Releases Forensic Report of MP Gorantla Madhavs Video
x

గోరంట్ల వీడియో నిజమైనదే.. అమెరికన్ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిందన్న టీడీపీ..

Highlights

Pattabhi Ram: రేపు, మర్డర్ కేసులున్న గోరంట్ల మాధవ్‌ని పార్లమెంట్‌కి పంపిన వ్యక్తి జనగ్ రెడ్డి అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ విమర్శించారు.

Pattabhi Ram: రేపు, మర్డర్ కేసులున్న గోరంట్ల మాధవ్‌ని పార్లమెంట్‌కి పంపిన వ్యక్తి జనగ్ రెడ్డి అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను ఈనెల 9న అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపినట్లు తెలిపారు. ఆ వీడియోలో ఎలాంటి ఎడిటింగ్ చేయలేదని ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టాఫర్డ్ నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవడానికి జగన్ రెడ్డికి ఈ నివేదిక సరిపోతుందాని ప్రశ్నించారు. మాధవ్‌పై చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంశాఖ, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్ రిపోర్ట్ తేవడం జగన్‌కు చేతకాలేదనే మేము తెచ్చామని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడకలు జరుపుకుంటున్న ఈ సమయంలో మహిళలకు రక్షణ కల్పించండని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ చేసిన పనికి మహిళలంతా సిగ్గుపడాల్సి వస్తోందని ఆందోళన చెందారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories