ఏపీ సీఎం జ‌గ‌న్‌కి టీడీపీ నేత నారా లోకేష్ లేఖ

Nara Lokesh: పింఛ‌న్‌ను ర‌ద్దు చేయాల‌నుకోవ‌డం అన్యాయమని లేఖ

Jyothi
Updated on: 28 Dec 2022 7:01 PM IST
TDP Leader Nara Lokesh Letter to AP CM Jagan
X

ఏపీ సీఎం జ‌గ‌న్‌కి టీడీపీ నేత నారా లోకేష్ లేఖ

Nara Lokesh: ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. అధికార పీఠం ఎక్కేందుకు పింఛ‌న్ల పెంపు పేరుతో అవ్వాతాత‌లు, అనాథ‌లు, ఒంట‌రి మ‌హిళ‌లు, దివ్యాంగుల‌కు.. మీరు ఇచ్చిన హామీలు మ‌రిచిపోయారా అని లెటర్‌లో ప్రశ్నించారు.

గ‌ద్దె ఎక్కాక పింఛ‌న్ల న‌య‌వంచ‌నకి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం 200 రూపాయలు ఉన్న పింఛ‌నుని ప‌దిరెట్లు పెంచి 2000 రూపాయలు చేసిందని గుర్తు చేసిన లోకేష్.. మీరు 3000 రూపాయల పింఛ‌ను చేస్తామ‌ని హామీ ఇచ్చి మోస‌గించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 ల‌క్షల మంది పింఛ‌న్‌ను ర‌ద్దు చేయాల‌నుకోవ‌డం చాలా అన్యాయమన్నారు లోకేష్.

Jyothi

Jyothi

Next Story