Guntur: టీడీపీ నాయకుడు నక్కా ఆనంద్ బాబు అరెస్ట్

Nakka Anand Babu: గురజాల వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

R Tripura Malini
Published on: 23 Dec 2022 5:09 PM IST
TDP Leader Nakka Anand Babu Arrested
X

టీడీపీ నాయకుడు నక్కా ఆనంద్ బాబు అరెస్ట్

Guntur: టీడీపీ సమావేశానికి గురజాల వెళుతున్న ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు నక్కా ఆనంద్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. చిలకలూరిపేట జాతీయ రహదారిపై అడ్డుకొని నగరంపాలెం పీఎస్‌కు తరలించారు. పోలీసులు తీరుపై నక్కా ఆనంద బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను కావాలనే గృహ నిర్భందం చేస్తున్నారని మండిపడ్డారు. మాచర్లలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు మాచర్లలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నా ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు నక్కా ఆనంద్ బాబు.

R Tripura Malini

R Tripura Malini

Next Story