Andhra Pradesh: స్పీకర్‌ తమ్మినేనిపై మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ హాట్‌ కామెంట్స్

Andhra Pradesh: ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌.

Arun Chilukuri
Published on: 15 April 2021 3:57 PM IST
TDP Leader Kuna Ravi Kumar Sensational Comments On AP Speaker Tammineni Sitaram
X

Andhra Pradesh: స్పీకర్‌ తమ్మినేనిపై మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ హాట్‌ కామెంట్స్

Andhra Pradesh: ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌. తనపై తప్పుడు కేసులు పెట్టిన సీతారాంను భవిష్యత్‌లో ఆముదాలవలస నడిరోడ్డుపైన గుడ్డలు ఊడదీసి పరిగెట్టిస్తానని ఆయన హెచ్చరించారు. తమ్మినేని ఇంట్లో ఓ ఊర కుక్క మొరుగుతోందని, ఆ ఊర కుక్క అరుపులకు తాను భయపడనని చెప్పారు. చట్టం సహకరించకపోయినా న్యాయం తనకు అండగా నిలబడిందన్న కూన తనపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై న్యాయం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

కాగా కూన రవికుమార్‌కు బెయిల్ మంజూరయింది. రాజాం సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం కూన రవికి బెయిల్ మంజూరు చేసింది. పెనుబర్తిలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన కొట్లాటలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన గురువారం ఉదయం పొందూరు పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story