జైలు నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విడుదల

X
Highlights
TDP Leader Kollu Ravindra released from jail: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జైలు నుంచి విడుదలయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర నెలన్నర రోజుల క్రితం జైలుకెళ్లారు.
Arun Chilukuri26 Aug 2020 4:01 AM GMT
TDP Leader Kollu Ravindra released from jail: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జైలు నుంచి విడుదలయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర నెలన్నర రోజుల క్రితం జైలుకెళ్లారు. ఆయనకు నిన్న కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కొల్లు రవీంద్ర నేడు ఉదయం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఏ-4 నిందితునిగా ఉన్న రవీంద్ర గత 53 రోజులుగా జైల్లోనే ఉన్నారు. 53 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే 28 రోజుల పాటూ విజయవాడలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. అది కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కేసులు ఉన్నాయి, అందుకే ఆయన్ను విజయవాడలోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని కోర్టు సూచించినట్లు తెలుస్తోంది.
Web TitleTDP Leader Kollu Ravindra released from jail
Next Story