టీడీపీ ఆత్మీయసమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 16 July 2021 4:46 PM IST
TDP Leader JC Prabhakar Reddy Sensational Comments
X

జేసీ ప్రభాకర్ రెడ్డి(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో నిర్వహించిన టీడీపీ ఆత్మీయ సమావేశంలో ప్రసంగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు దయతో ఎమ్మెల్యే అయ్యానన్నారు. చంద్రబాబును సీఎం చేయడానికి ఎవరినైనా ఎదిరిస్తానని చెప్పారు. కొందరు పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కోసం పని చేస్తామన్నారు. తనపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కోసం పని చేస్తానని ఎంత దూరం అయినా వెళుతానన్నారు. పల్లెపల్లెకు తిరుగుతాం కార్యకర్తలను కలుస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story