టీడీపీకి మరో షాక్.. 'గద్దె' గుడ్‌బై..

టీడీపీకి మరో షాక్.. గద్దె గుడ్‌బై..
x
Highlights

ఏపీలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు గద్దె రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ అధిష్టానం వైజారిపట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన ఆదివారం టీడీపీకి రాజినామా చేస్తునట్టు ప్రకటించారు..

ఏపీలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు గద్దె బాబురావు రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ అధిష్టానం వైజారిపట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన ఆదివారం టీడీపీకి రాజినామా చేస్తునట్టు ప్రకటించారు. విజయనగరం జిల్లాలో కీలకనేతగా ఉన్న బాబురావు.. 1994-99 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తనకు ప్రాధాన్యం లేదని.. చీపురుపల్లి నియోజకవర్గ ఇంఛార్జిని చేయాలని కోరినా స్పందన లేకపోవడంతో జులై 2, 2013 వ తేదీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తరువాత తిరిగి టీడీపీలో చేరారు.

చీపురుపల్లి అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం కిమిడి మృణాళినికి టిక్కెట్ ఇచ్చింది. ఈ క్రమంలో 2019 లో కూడా ఆశించినా సీటు దక్కలేదు. దాంతో అప్పటినుంచి టీడీపీకి దూరంగా ఉన్నారు. తాజాగా పార్టీలో పరిస్థితులు బాగోలేవని.. సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదని.. ఆత్మ గౌరవం.. ఆత్మ స్థైర్యంతో పుట్టిన పార్టీ ప్రస్తుతం కరుమరుగైందని ఆరోపిస్తూ.. టీడీపీ రాజీనామా చేశారు. కాగా గద్దె బాబూరావు ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా పని చేశారు. త్వరలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని కొందరు.. బీజేపీలో చేరాతరాని మరికొందరు భావిస్తున్నారు. రెండు మూడు రోజులలో దీనికి సంబంధించి నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు ఆయన అనుచరులు.

Show Full Article
Print Article
Next Story
More Stories