Kollu Ravindra: టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్‌

Kollu Ravindra: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Samba Siva Rao
Updated on: 11 March 2021 9:03 AM IST
kollu ravindra
X

కొల్లు రవీంద్ర ఫైల్ ఫోటో  (thehans India)

Kollu Ravindra: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎన్నికల పోలింగ్‌ బూత్‌ దగ్గర పోలీసులు, కొల్లు రవీంద్ర మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఎస్సైపై చేయి చేసుకున్న ఘటనలో కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ ఉదయం కొల్లు ఇంటికి చేరుకున్న పోలీసులు.. రవీంద్రను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు అరెస్ట్ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు.. కొల్లు రవీంద్ర ఇంటికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

అయితే బుధవారం మచిలిపట్నం 25వ డివిజన్‌ సర్కిల్‌పేటలోని పోలింగ్‌ కేంద్రానికి టీడీపీ నేత మాజీ మంత్రి కొల్ల రవీంద్ర, మరి కొందరి కార్యకర్తలతో కలిసి వెళ్లారు. 144 సెక్షన్‌ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. లోపలికి వెళ్లడానికి కుదరదని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ లోపలికి వెళ్లకుండా అడ్గుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆవేశంలో కొల్లు రవీంద్ర విధుల్లో ఉన్న ఎస్‌ఐపై చేయి చేసుకున్నారు. దీంతో కాసేపు ఓటింగ్‌ ప్రక్రియను ఆటంకం కలిగింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story