Andhra Pradesh: తెదేపా సీనియర్‌ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టు

Andhra Pradesh: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

Rama Rao
Published on: 3 Nov 2022 7:29 AM IST
TDP Leader Ex Minister Chintakayala Ayyanna Patrudu Arrested  | AP News
X

Andhra Pradesh: తెదేపా సీనియర్‌ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టు

Andhra Pradesh: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలుయ సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో గురువారం వేకువ జామున భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం అయ్యన్నకు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ పోలీసులు అయ్యన్నపై పలు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story