Andhra Pradesh: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది: దేవినేని

Andhra Pradesh: సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ‌

Samba Siva Rao
Published on: 11 April 2021 4:26 PM IST
Devineni Uma Fire On Cm Jagan
X

దేవినేని ఉమా ఫైల్ ఫోటో 

Andhra Pradesh: ఏపీలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని విమర్శించారు. తప్పుడు కేసులు పెడితే భయపడేది లేదు హెచ్చరించారు. ప్రభుత్వ చేతగాని తనాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రతి అమావాస్యకు తనపై కేసులు పెడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. 505 సెక్షన్ ఎలా అప్లై అవుతుందని ప్రశ్నించారు.

ఇది రెండు గ్రూప్‌ల మధ్య గొడవ కాదని, కత్తిపోటుతో చనిపోతే గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిపై కేసు పెట్టాలన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఇంట్లో కుక్కకు విషం పెట్టి ఎవరు చంపారో వారిపైనే కేసు పెట్టాలని దేవినేని ఉమా అన్నారు. పక్క రాష్ట్రాలతో సీఎం జగన్ కుమ్మక్కయి ఏపీకి ద్రోహం చేశారని దేవినేని విమర్శించారు. మోదీ, మమత, స్టాలిన్ సభలు నిర్వహిస్తుంటే..‎సీఎం జగన్‌కు మాత్రం కరోనా భయం పట్టుకుందని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story