ఎంపీ విజయసాయిరెడ్డిపై చిన్నరాజప్ప తీవ్ర విమర్శలు

Arun Chilukuri
Published on: 26 Dec 2020 4:35 PM IST
ఎంపీ విజయసాయిరెడ్డిపై చిన్నరాజప్ప తీవ్ర విమర్శలు
X

విశాఖలో వేలాది ఎకరాల భూములను ఎంపీ విజయసాయిరెడ్డి దోచుకున్నారని ఇప్పుడు టీడీపీ నేతల భూములపై కూడా దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. విజయసాయిరెడ్డికి దమ్ముంటే ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ విసిరారు. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్‌ టీడీపీలో ట్రైనింగ్‌ అయి వెళ్లారన్న సంగతి మర్చిపోయి విమర్శలు ‎చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే వెలగపూడి నిజాయితీగా ఉన్నారు కాబట్టే.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు చినరాజప్ప.‎

Arun Chilukuri

Arun Chilukuri

Next Story