Chalamalasetty Sunil join in YSRCP: నేడు వైసీపీలోకి చలమలశెట్టి సునీల్

X
Highlights
Chalamalasetty Sunil join in YSRCP: ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ నేత చలమలశెట్టి...
Arun Chilukuri10 Aug 2020 7:02 AM GMT
Chalamalasetty Sunil join in YSRCP: ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ నేడు వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సునీల్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన సునీల్ వైసీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో పరాజయం చవిచూశారు. అప్పటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. 2022లో రాజ్యసభకు ఖాళీ అవుతున్న ఓ ఎంపీ స్థానంలో సునీల్‌కు అవకాశం కల్పించడానికి అధికార పార్టీతో ఇటీవల మంతనాలు జరిగినట్టు సమాచారం. అయితే ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు వైసీపీ కండువాలను కప్పుకున్న విషయం తెలిసిందే. మరికొందరు కూడా అధికార పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
Web TitleTDP Leader Chalamalasetty Sunil join in YSRCP today
Next Story