logo
ఆంధ్రప్రదేశ్

విచారణకు హాజరయ్యే ప్రసక్తే లేదు: బోండా ఉమ

TDP Leader Bonda Uma Sensational Comments on Vasireddy Padma
X

విచారణకు హాజరయ్యే ప్రసక్తే లేదు: బోండా ఉమ

Highlights

Bonda Uma vs Vasireddy Padma: ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ మరోసారి మండిపడ్డారు.

Bonda Uma vs Vasireddy Padma: ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ మరోసారి మండిపడ్డారు. మహిళా కమిషన్ కు కూడా లేని పవర్స్ ను ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పెన్ను, పేపర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉన్నది మహిళల హక్కులను కాపాడేందుకా? లేక వైసీపీ హక్కులను కాపాడేందుకా? అని బోండా ప్రశ్నించారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చంద్రబాబు వస్తున్నారని తెలుసుకునే ఆమె హడావుడిగా మేకప్ వేసుకుని అక్కడకు వచ్చారని ఉమ ఎద్దేవా చేశారు. మహిళా కమిషన్ విచారణకు తాము వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.

Web TitleTDP Leader Bonda Uma Sensational Comments on Vasireddy Padma
Next Story