Visakhapatnam: పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న టీడీపీ నేత బొమ్మిడి రమణ

Swathi Adulapuram
Published on: 24 April 2020 2:48 PM IST
Visakhapatnam: పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న టీడీపీ నేత బొమ్మిడి రమణ
X

విశాఖపట్నం జీవీఎంసీ 90వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మిడి రమణ (శ్రీను) ఆర్థిక సహాయంతో బుచ్చిరాజుపాలెం, ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పౌష్టికాహారం, గుడ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొమ్మిడి రమణ మాట్లాడుతూ... కరోనా వైరస్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు గణబాబు ఆదేశాల మేరకు ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే 90వ వార్డు పరిధిలోని ప్రజలకు, నిరుపేదలకు, అభాగ్యులకు తన వంతు సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Swathi Adulapuram

Swathi Adulapuram

Next Story