తిరుమల : శ్రీవారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు

Arun Chilukuri
Published on: 2 Sept 2020 10:54 AM IST
తిరుమల : శ్రీవారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు
X

Atchannaidu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న అచ్చెన్నకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టైన అచ్చెన్నాయడుకి ఇటీవలె బెయిల్‌ లభించింది. అయితే అచ్చెన్నకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవలె ఆయన కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story