AtchanNaidu Discharge: జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్

AtchanNaidu Discharge: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు..

Krishna
Published on: 1 July 2020 10:00 PM IST
AtchanNaidu Discharge: జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
X

AtchanNaidu Discharge: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.. అనంతరం ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడు విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు... గత కొద్దికాలం క్రితం ఈఎస్‌ఐ కుంభకోణం కేసుల అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.. ఈఎస్‌ఐ స్కామ్‌ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా ఆయనను జీజీహెచ్‌కు తరలించారు.

అక్కడ ఆయనని జూన్ 25-27 వరకు మూడు రోజుల పాటు విచారించారు. ఇక తాజాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఇది జగన్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యేనని వారు ధ్వజమెత్తారు.


Krishna

Krishna

Next Story