Alapati Raja About Atchem Naidu Health: జీజీహెచ్‌లో కరోనా.. అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై మాజీ మంత్రి ఆలపాటి ఆరా

Alapati Raja About Atchem Naidu Health: జీజీహెచ్‌లో కరోనా.. అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై మాజీ మంత్రి ఆలపాటి ఆరా
x
Atchem Naidu (File Photo)
Highlights

Atchem Naidu Health Condition: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Alapati Raja About Atchem Naidu Health: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.జీజీహెచ్‌లో కరోనా వ్యాప్తి చెందుతుండటమే దీనికి కారణం. జీజీహెచ్ లో ముగ్గురు డాక్టర్లు, ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యారు. ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్ట్ ఆయనకు గత కొన్నిరోజులుగా అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వైద్య సిబ్బంది కరోనా అన్న వార్తలతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. జీజీహెచ్‌కు చేరుకుంటున్న టీడీపీ నేతలు ఆయన ఆరోగ్య పరిస్థితి వాకబు చేస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు.

ఈ నేపథ్యంలో జిజిహెచ్ కు మాజీ మంత్రి ఆలపాటి రాజా వెళ్లి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ.. గుంటూరు జిజిహెచ్ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఓ వైపు కోవిడ్ కేసులు, మరో వైపు నాన్ కోవిడ్ చికిత్స లు చేస్తున్నారని .. అదే వైద్య సిబ్బంది కరోనా రోగులకు వైద్య సేవలు చేస్తున్నారన్నారు. ఇతర వైద్య పరీక్షల కోసం వచ్చిన వారికి కూడా జిజిహెచ్ లో పాజీటీవ్ వస్తుందని ఆరోపించారు. ఓ తల్లి కూతురుకు కూడా ఇదే విదంగా పాజిటీవ్ సోకిందని ఆయన వెల్లించారు. ఇతర రోగాలతో వైద్యం కోసం ఇక్కడికి రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అచ్చెన్నాయుడుకు వైద్యం చేసిన వైద్యులకు కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోందని..తక్షణమే అచ్చెన్నాయుడుకు వైద్యం చేసిన వైద్యుల రిపోర్ట్ లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జిజిహెచ్ సూపరింటెండెంట్ అచ్చెన్నాయుడు ఆరోగ్యం విషయం ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా అచ్చెన్నాయుడు వద్దకు ప్రవేశం లేదని ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోలేని పరిస్థితి ఉందని ఆలపాటి అన్నారు. అచ్చెన్నాయుడు పట్ల ప్రభత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆలపాటి అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories