TDP-Janasena: ఇవాళ టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం

TDP-Janasena: హాజరుకానున్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్,కమిటీ సభ్యులు

Jyothi
Updated on: 22 Feb 2024 9:15 AM IST
TDP-Janasena Coordination Committee Meeting today
X

TDP-Janasena: ఇవాళ టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం

TDP-Janasena: రాబోయే ఎన్నికలపై టీడీపీ-జనసేన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించిన ఇరు పార్టీలు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుంది. ఉమ్మడి మేనిఫెస్టోపై కమిటీ కసరత్తు ప్రారంభించిన ఇప్పటికే పలు దఫాలుగా భేటీ అయిన నేతలు మరోసారి సమావేశం కానున్నారు. ఇవాళ టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నోవాటెల్ హోటల్ లో జరిగే సమావేశంంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యులు పాల్గొంటారు. ఉమ్మడి మేనిఫెస్టో కి కమిటీ తుది రూపు ఇవ్వనుంది. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారంపై కమిటీలో చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story