ఉత్తరాంధ్రపై టీడీపీ, జనసేన ఫోకస్‌

ఉత్తరాంధ్రలో వరుసగా, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న పవన్

Jyothi
Published on: 8 Dec 2023 12:54 PM IST
TDP, Jana Sena Focus on Uttarandhra
X

ఉత్తరాంధ్రపై టీడీపీ, జనసేన ఫోకస్‌

Uttarandhra: ఉత్తరాంధ్రపై టీడీపీ, జనసేన ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాంధ్రలో జనసేనను బలోపేతం చేసేందుకు జనసేనాని వ్యూహాలు రచిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ వరుసగా ఉత్తరాంధ్రలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని పటిష్ట పరుస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రపై ఫోకస్‌ పెట్టారు. విశాఖ కేంద్రంగా చంద్రబాబు, పవన్‌ వరుసగా పర్యటనలు చేస్తున్నారు.

విశాఖలో లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు చంద్రబాబు, పవన్‌ హాజరుకానున్నారు. పొత్తుల అనంతరం ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌ రానున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఇరు నేతలు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రాజధాని, విశాఖ ఉక్కు , భూకబ్జాలు, వలసల పైన ఇరు నేతలు ప్రశ్నించనున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ రాజధానిని ఏర్పాటులో వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని టీడీపీ-జనసేన పార్టీలు విమర్శిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story