TDP First List: సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్..?

TDP first list for Sankranti?
x

TDP First List: సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్..?

Highlights

TDP First List: తొలి జాబితాలో చోటెవరికి అని తమ్ముళ్లలో మొదలైన టెన్షన్

TDP First List: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు టైం దగ్గర పడడంతో ఏపీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు షురూ అయింది. ఓ వైపు ఇంఛార్జుల మార్పులు, చేర్పులతో వైసీపీలో హడావిడి నెలకొంది. ఇప్పటికే రెండు లిస్టులను విడుదల చేశారు సీఎం జగన్. మరి టీడీపీ సంగతేంటి..? ఫస్ట్ లిస్టును ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అసలు కసరత్తు మొదలైందా లేదా..? తొలి జాబితాలో చోటు దక్కేదెవరికి అనే ఆసక్తి తమ్ముళ్లలో నెలకొంది. ఐతే ఈ ఉత్కంఠకు తెర దించేలా సంక్రాంతికి టీడీపీ అభ్యర్థులతో తొలి జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పొలిటికల్ పరుగుపందెంలో ఏ మాత్రం తడబడ్డా రేసులో వెనకబడిపోతాం. ఒకదాని వెంట ఒకటి అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేస్తూ జగన్ దూసుకుపోతున్నారు. దీంతో పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేకపోతే పోటీలో వెనకబడతాం అని గ్రహించిన చంద్రబాబు.. త్వరలోనే ఫస్ట్ లిస్ట్ రిలీజ్‌ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. సంక్రాంతికి తొలి విడత అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. జనసేనతో పొత్తు పంచాయితీ లేని, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు రిలీజ్ కానుందని, అందుకు చంద్రబాబు కసరత్తు వేగవంతం చేస్తున్నారని సమచారం. సర్వే అంచనాలను బేరిజు వేసుకుంటూ బలమైన అభ్యర్థులతో లిస్టు ఉండబోతోందట. ఇందులో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

వైసీసీ సర్కార్‌ను ఎదుర్కొనేందుకు, రాబోయే ఎన్నికల్లో జగన్‌ను గద్దెదించేందుకు ఉమ్మడి పోరాటానికి రెడీ అయ్యారు చంద్రబాబు, పవన్. ఇప్పటికే రెండు పార్టీల మధ్య ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనతో పాటు సీట్ల పంపకాలపైనా మంతనాలు జరుగుతున్నాయి. ఐతే జనసేనకు పట్టున్న గోదావరి జిల్లాలపై.. పవన్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 34సీట్లు ఉంటే.. దాదాపు 25సీట్లను జనసేన డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో.. ఆ సీట్ల కోసం జనసేన పట్టుబడుతోంది. ఐతే పవన్ అడుగుతున్న స్థానాలు గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్నాయి. 2019లో ఇక్కడ వైసీపీ గాలి వీచింది కానీ..అంతకు ముందు టీడీపీ మంచి ఫలితాలను రాబట్టింది. దీంతో ఆ స్థానాలను వదులుకునేందుకు బాబు రెడీగా ఉన్నారా.. పవన్ డిమాండ్‌కు దిగొస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ ఫస్ట్ లిస్టులో కొంతమంది సిటింగ్ స్థానాలు కూడా ఉండనున్నాయట.

Show Full Article
Print Article
Next Story
More Stories