Andhra Pradesh: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదల

TDP Ex MLA Chintamaneni Prabhakar Released
x

చింతమనేని ప్రభాకర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Andhra Pradesh: నిన్న విశాఖ జిల్లా చింతపల్లి వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది. కావాలనే అక్రమ అరెస్టులు చేసి వేధిస్తున్నరని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అరాచకంగా ఉందో చెప్పడానికి చింతమనేని అరెస్టే నిదర్శనమని మండిపడుతున్నారు. కావాలనే కక్షపూరితంగా చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చెశారని తప్పుబడుతున్నారు తెలుగుదమ్ముళ్లు.

పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధర్నా నిర్వహించారు. అయితే పోలీసులపై దౌర్జన్యం చేశారంటూ చింతమనేనిపై అక్రమ కేసు నమోదు చేశారని ఏలూరు పార్లమెంటరీ ఇంఛార్జి గన్ని వీరంజనేయులు మండిపడుతున్నారు.పశ్చిమగోదావరి జిల్లాలోని భీమడోలు పోలీస్ స్టేషన్‌లో 41A CRPC నోటీస్‌ను ఇచ్చి విడుదల చేయడంతో చింతమనేనికి పోలీసులు ఇంటి వద్ద విడిచిపెట్టారు. ప్రభుత్వం కావాలనే అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తుందని చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories