టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
x
Highlights

TDP EX MLA chandana ramesh joins in ysr congress party: ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన...

TDP EX MLA chandana ramesh joins in ysr congress party: ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్‌ అధికార వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో చందన రమేష్, ఆయన తనయుడు నాగేశ్వర్‌లు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా చందన రమేష్, ఆయన కుమారుడు నాగేశ్వర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ తదితరులు పాల్గొన్నారు. చందన రమేష్ 2009లో కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ టీడీపీలోనే కొనసాగారు. తర్వాత 2019 ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీచేసి విజయం సాధించారు. అయినా చందన రమేష్ పార్టీలోనే కొనసాగారు. కొద్దిరోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్న ఆయన జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories