ఉద్రిక్తతగా టీడీపీ ధర్మపరిరక్షణ యాత్ర

X
Highlights
టీడీపీ చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్ర ఉద్రిక్తతంగా మారింది. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు...
Arun Chilukuri21 Jan 2021 7:22 AM GMT
టీడీపీ చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్ర ఉద్రిక్తతంగా మారింది. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అటు తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ దగ్గర పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా నెలకొంది. అచ్చెన్నాయుడును బస చేసిన హోటల్‌లోనే దిగ్భందించారు పోలీసులు. అటు మాజీ మంత్రులు ఆనంద్ బాబు, అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేలు సత్యప్రసాద్, రామానాయుడును కూడా అరెస్ట్ చేశారు.
టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తమ్ముళ్లు ధర్నాకు దిగారు. అదేవిధంగా అరెస్ట్ చేసిన తమ నేతలను విడుదల చేయాలంటూ పోలీస్ వ్యాన్ ఎదుట బైటాయించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Web TitleTDP Dharma Parirakshana Yatra will begin
Next Story