Badvel By-Election: బద్వేల్‌ ఉపఎన్నిక పోటీపై టీడీపీ తర్జన భర్జన

* గత సాంప్రదాయాలను పాటించాలనే అభిప్రాయంతో పలువురు నేతలు * మృతి చెందిన ఎమ్మెల్యే సుబ్బయ్య భార్యకే టికెట్‌ ఇచ్చిన వైసీపీ

Shilpa
Updated on: 3 Oct 2021 7:00 PM IST
TDP Confusion Over Competition of Badvel By-Election
X

చంద్రబాబు నాయుడు (ఫోటో- ది హన్స్ ఇండియా)

Badvel By-Election: బద్వేల్‌ ఉపఎన్నిక పోటీపై టీడీపీ తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే అభ్యర్థిగా రాజశేఖర్‌ను ప్రకటించగా గత సాంప్రదాయాలను పాటిస్తే మంచిదంటూ పలువురు నేతలు బాబుతో చెప్పినట్లు సమాచారం. అటు మృతి చెందిన ఎమ్మెల్యే సుబ్బయ్య భార్యకే వైసీపీ టికెట్‌ ఇవ్వగా సానుభూతి కోణంలో పోటీకి దూరంగా ఉండాలని కొందరు నేతలు బాబుకు చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు అభ్యర్థిగా రాజశేఖర్ ప్రకటన తర్వాత పునరాలోచన వద్దని బాబుతో మరికొందరు నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు హైదరాబాద్‌ నుంచి అమరావతికి రానున్న చంద్రబాబు, బద్వేల్‌ ఉపఎన్నికపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉండనుంది. కాగా రెండ్రోజుల క్రితమే హైదరాబాద్‌లో చంద్రబాబును కలిశారు బద్వేల్‌ టీడీపీ అభ్యర్థి రాజశేఖర్‌.

Shilpa

Shilpa

Next Story