నటన అయినా, ప్రజాసేవ అయినా... చేసే పనిలో నిబద్ధత : చంద్రబాబు

నటన అయినా, ప్రజాసేవ అయినా... చేసే పనిలో నిబద్ధత : చంద్రబాబు
x
Chandrababu Naidu Birthday Wishes to Balakrishna
Highlights

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ 60వ పుట్టిన రోజు నేడు.

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ 60వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు. 'నటన అయినా, ప్రజాసేవ అయినా... చేసే పనిలో నూటికి నూరుపాళ్ళు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణగారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణగారు అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ఆయనకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు' అంటూ పేర్కొన్నారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,

మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ ఆయన బాలయ్య. తన ఒక్కడికీ మాత్రం ముద్దుల మావయ్య అని లోకేశ్ సంబోధించారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడని అన్నారు.. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు అంటూ లోకేశ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే నిన్న బాలయ్య కొత్త సినిమా టీజర్ ను చూసిన లోకేశ్ మామయ్యను అభినందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories